న్యూస్ ఛానెళ్ల అతి వల్ల నష్టపోయేదెవరు ?

సొసైటీ లో మీడియా కు ఓ ప్రత్యేక గౌరవం…ఇది ఇప్పుడు కాదు ఒకప్పుడు..ప్రస్తుతం మీడియా అంటే అందరూ ఛీ అనే స్థాయికి దిగజారింది. ప్రజల అవసరాలు తీర్చడం పోయి, వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కొన్ని రాజకీయ పార్టీ ల చేతుల్లో కొన్ని మీడియా చానెల్స్ ఉన్నాయి. తమ పార్టీ గురించి గొప్పలు చెప్పుకోవడం , చేసింది గోరంత అయితే చెప్పేది కొండతగా చెప్పడం , ఇతర పార్టీలను తిట్టడం , తమ పార్టీనే గొప్ప అని ప్రజలకు భ్రమ కల్పించడం తప్ప వాస్తవంగా జరిగేది మాత్రం చూపించడం లేదు. అందుకే ప్రస్తుతం న్యూస్ ఛానల్ ను నమ్ముకోకుండా సోషల్ మీడియా ను , యూట్యూబ్ చానెల్స్ లను నమ్ముకుంటూ అక్కడ వచ్చే వార్తల గురించే మాట్లాడుకుంటున్నారు.

అన్ని ఛానల్స్ అలాగే ఉన్నాయి అంటే ఆలా ఏమి లేదు మేజర్ చానెల్స్ మాత్రం పార్టీలకు పనిచేస్తుండగా , కొన్ని చానెల్స్ మాత్రం స్వతహా గా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఓ ఛానల్ ను మైంటైన్ చేయాలంటే కనీసం నెలకు కోటి రూపాయిలు పెట్టుబడి పెట్టాలి. కాస్త చిన్న చితక ఛానల్ అయితే 50 నుండి 60 లక్షలు పెట్టాల్సిందే. అంత పెట్టుబడి పెట్టిన లాభాలు వస్తాయా అంటే అది లేదు.

రెండు రాష్టాలుగా విడిపోక ముందు కాస్తో కూస్తో ప్రకటనల ద్వారా వచ్చేవి. కానీ విడిపోయాక ప్రకటనలు తగ్గిపోయాయి. ఓ ఛానల్ కు ఇచ్చి మరో ఛానల్ కు ఇవ్వకపోతే లేనిపోని కథనాలు ప్రచారం చేస్తున్నారు. అందుకే ప్రకటనలు ఇవ్వాల్సిన వారు కూడా న్యూస్ చానెల్స్ కు ఇవ్వకుండా ఎంటర్టైన్మెంట్ చానెల్స్ కు ఇస్తూ తమ బిజినెస్ ను పెంచుకుంటున్నారు. అందులోనూ న్యూస్ చానెల్స్ కంటే ఎంటర్టైన్మెంట్ చానెల్స్ లలోనే తక్కువ పెట్టుబడి తో ఎక్కువ బిజినెస్ జరుగుతుండడం తో యాడ్స్ ఇచ్చే వారంత న్యూస్ చానెల్స్ లను పక్కకు పెడుతున్నారు.

దీంతో న్యూస్ చానెల్స్ తమ లాభాల కోసం లేదా ఛానెల్ మైంటైన్ చేయడం కోసం రాజకీయ పార్టీలకు మద్దతు తెలుపుతున్నారు. ఇలా మద్దతు తెలుపడం వల్ల ప్రజలు సదరు చానెల్స్ ఫై మండిపడుతున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.