ప‌సుపు కుంకుమ ద‌గ్గ‌ర గోలేంది…

ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇవ్వాలి..ప్రజలను ఎలా ఆకర్షించాలి..వారికోసం ఏ ఏ పధకాలు తీసుకురావాలి..ప్రజల కష్టాలు ఏంటి..వారికీ ఏ ఏ అవసరాలు ఉన్నాయి..వాటిని తీర్చాలంటే ఏం చేయాలి..ఇలా ఇవన్నీ ఆలోచించుకొని జనాల్లోకి వెళ్తే బాగుంటుంది కానీ తమకు క్రిడిట్ రావడం లేదని..అధికార పార్టీ కే క్రిడిట్ అంత పోతుందని వారి పథకాలు దగ్గరికి వెళ్లి గొడవ చేస్తే ఏమొస్తుందో ఓసారి వైస్సార్సీపీ పార్టీ నేతలు ఆలోచిస్తే మంచిది.

ఎందుకంటే తాజాగా ప‌సుపు కుంకుమ కార్యక్రమం దగ్గర పోయి గొడవ చేస్తే..ప్రజల్లో మీకు క్రిడిట్ రాదు సరికదా ఉన్న క్రిడిట్ కూడా పోతుందని రాజకీయ విశ్లేషకులు వైస్సార్సీపీ నేతలకు సూచిస్తున్నారు. ఎన్నికల్లో సమయాల్లో ఏ పార్టీ వారైనా సరే ఓట్ల కోసం ఏవో పధకాలు ప్రవేశ పెట్టి జనాలను ఆకర్షిస్తారు..ఇది ఈరోజు కాదు ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ..అంతే కానీ ఆ పథకాలు అడ్డుకుంటామని , అందులో ఏవో లోపాలు ఉన్నాయని ప్రజల మధ్యకు వెళ్లి గొడవ చేయడం మంచి పద్ధతి కాదని చెపుతున్నారు.

ప్రజాస్వామ్యం లో ప్రతిదానిని వ్యతిరేకించకూడదు, వ్యతిరేకించాల్సిన వాటిని ప్రజలకు విరుద్ధంగా ఉండే వాటిని వ్యతిరేకించాలి అంతే తప్ప వారి అవసరాలు తీర్చే వాటిని వ్యతిరేకించడం వల్ల వారికే చెడ్డ పేరు రావడమే కాదు జనాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి అంటున్నారు. మరి ఇకనైనా ఇలాంటి తప్పులు జరగకుండా వైస్సార్సీపీ అధినేత చేసుకుంటాడో లేదో.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.