తెలుగుదేశం వైసీపీల‌కు స‌మ‌దూర‌మేనా..

జనసేన ‘యెల్లో’ సేన అయ్యిందా..? పవన్ టీడీపీ పార్టీ లో కలిసిపోయారా..? పవన్ కు ఓటు వేస్తే అది టీడీపీకి వేసినట్లేనా..? చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నడుస్తున్నాడా..? బాబు ఎంచెపితే పవన్ అది చేస్తున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. దీనికి కారణం తెలుగుదేశం అనుకూల మీడియానే. మొన్నటి వరకు పవన్ ప్రస్తావన కానీ కనీసం పవన్ పేరు కూడా చెప్పని టీడీపీ మీడియా…ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ఇచ్చే స్టేట్మెంట్స్ హైలైట్ చేయడమే కాదు..మొదటి పేజీ మొదటి లైన్లోనే వేస్తున్నారు. మొన్నటి వరకు టీడీపీ ఓ రేంజ్ లో కామెంట్స్..నిప్పులు చెరిగిన పవన్..ఇప్పుడు కేవలం వైసీపీ పార్టీ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు.

జగన్ వస్తే రాష్ట్రం ఏదో అవుతుందని చెపుతూనే బాబు కు ఓటెయ్యండి అన్నట్లు చెపుతున్నట్లు తన ప్రసంగాలు చూస్తే జనాలకు అర్ధం అవుతుంది. మొన్నటి వరకు జై జనసేన అన్నవారు..ఇప్పుడు జై వైసీపీ అంటున్నారు. తెలుగుదేశం తీరు నచ్చకనే జనసేన పార్టీ లో చేరిన వారంతా ఇప్పుడు పవన్ టీడీపీ కి సపోర్ట్ చేస్తుండడం తో వారంతా వైసీపీ బాట పడుతున్నారు. పవన్ తీరుఫై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు మీరే చూడండి.