ఆ నాల్గు జిల్లాల్లో పవన్ దెబ్బ ఎక్కువ ఉంది..

ప్రశ్నించడం కోసమే జనసేన అంటూ పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్..గత ఎన్నికల్లో బీజీపీ..తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇచ్చి వాటిని అధికారంలోకి తెచ్చేందుకు కీలక పాత్ర పోషించింది. ఈసారి మాత్రం ఓటరుగా బరిలోకి దిగుతున్నామంటూ చెపుతూ ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ..తెలుగుదేశం పార్టీ తో రహస్య మద్దతు పెట్టుకుందని మీడియా స్పష్టం గా చెపుతుంది.

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పవన్ కళ్యాణ్ తన ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. అప్పుడప్పుడు టీడీపీ ఫై విరుచుకుపడుతూ..మొత్తం టార్గెట్ వైసీపీ పైనే చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే పవన్ దెబ్బ నాల్గు జిల్లాల ఫై ఎక్కువగా ఉందని..ఆ నాల్గు జిల్లాలే రాష్ట్ర రూపు రేఖలు మారుస్తాయని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఆ నాల్గు జిల్లాలు ఏంటి..పవన్ ఎఫెక్ట్ ఎన్ని సీట్ల ఫై పడుతుందంటే..

ఈస్ట్ గోదావరి – 19 సీట్లు
వెస్ట్ గోదావరి – 15 సీట్లు
కృష్ణ జిల్లాలో – 16 సీట్లు
గుంటూరు – 15 సీట్లు
మొత్తం 65 స్థానాలు ఫై పవన్ ప్రభావం పడబోతుందని చెపుతున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.