కేసీఆర్ ని చూసి పవన్ ఒకటి గ్రహించాలి

ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో లో తెలిసినోడే నిజమైన నాయకుడు..ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి…సినిమాల్లో రైటర్స్ రాసే భారీ డైలాగ్స్ చెప్పి..చెప్పి అదే అలవాటు అయిందనుకుంటా…అదే మాదిరిగా..ప్రచారం లో కూడా భారీ డైలాగ్స్ చెపుతూ వస్తున్నాడు. కానీ డైలాగ్స్ చెప్పడంలో కాదు వాటిని పట్టించడం కూడా తెలియాలి.

మొన్నటి వరకు టీడీపీ పార్టీ ని టార్గెట్ చేసిన పవన్..ప్రస్తుతం వైసీపీ ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ ను తిట్టడం పనిగా పెట్టుకున్నాడు. రాజకీయాల్లో అన్ని చేయాలి…అందర్నీ విమర్శించాలి..కానీ ఎక్కడ విమర్శించాలో..ఎక్కడ తగ్గించాలో కూడా తెలియాలి..ఆలా తెలియకపోతే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం పవన్ ఆ ప్రమాదంలోనే ఉన్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంతసేపు వైసీపీ కి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నాడని పదే పదే చంద్రబాబు..పవన్ కళ్యాణ్ లు అంటున్నారు.

అసలు కేసీఆర్ మద్దతు ఇస్తే ఏంటి..? అనేది ఇప్పుడు ఏపీ ప్రజల్లో కలుగుతున్న ప్రశ్న. పవన్..మాయావతి సపోర్ట్ తీసుకోవచ్చు..చంద్రబాబు బద్ద శతృవైన కాంగ్రెస్ మద్దతు తీసుకోవచ్చు..కానీ జగన్ కేసీఆర్ మద్దతు తీసుకోవద్దు..అదేంటి. అసలు కేసీఆర్ ఏం చేసాడు..? తన రాష్ట్రం కోసం తాను కష్టపడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాడు. మీరు కూడా ఏపీ కోసం ప్రత్యేక హోదా తెచ్చుకోవచ్చు కదా….ప్రత్యేక హోదా ఇస్తామన్న టైములో హోదా వద్దు..ప్యాకేజ్ కావాలని అప్పుడు బాబు మాట్లాడి..ఇప్పుడు హోదా గురించి మాట్లాడడం ఏంటి..? మీరు ఏమిచేసినా ఓకే..అదే జగన్ చేస్తే తప్పా..అని అంత మాట్లాడుకుంటున్నారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారో వారి మాటల్లోనే వినండి.