పవన్ ప్రశ్నలకు జగన్ జవాబిస్తారా ?

ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్..వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి కొన్ని ప్రశ్నలు సంధించారు..వాటికీ సమాదానాలు చెప్పాలంటూ నిలదీశారు..మరి వాటికీ జగన్ స్పందిస్తారో లేదో..కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం వాటి గురించి మాట్లాడుకుంటున్నారు.

ఇంతకీ పవన్ జగన్ ఫై ఎలాంటి ప్రశ్నలు వేసారో ఇప్పుడు చూద్దాం..

* వివేకా చనిపోతే జగన్ ఎందుకు మౌనం గా ఉన్నారు..? చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు జగన్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు..?

* పులివెందుల రౌడీలు వచ్చి అరాచకాలు చేస్తారా..? రాయలసీమ నుండి వచ్చిన రౌడీలు కోస్తాలో వచ్చి అరాచకాలు చేస్తే ఉరుకుంటామా..? ఎందుకు చేయిస్తారు..? అంటూ జగన్ ను పవన్ ప్రశ్నించించాడు.

* కేసీఆర్ గురించి మీ బంధం ఎందుకు నోరు విప్పారు..? కేసీఆర్ తో బంధం ఉందా లేదా..? ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నారా లేదా..? ఆయన మద్దతు ఇస్తున్నట్లా..లేదా..? ఆయన బెదిరించి మీ దగ్గరికి పంపిస్తున్నారా లేదా..? ఆంధ్రాలో పుట్టారా…లేదా..? ఆంధ్ర ఆత్మాభిమానం ఉందా లేదా..? అనే ప్రశ్నలు పవన్ జగన్ కు వేశారు.

వీటిఫై జగన్ స్పందించలేదు..ఎంత సేపు వివేకా మరణం వెనుక టీడీపీ కుట్రనేనని..పవన్ టీడీపీ మనిషేనని అంటున్నాడు తప్ప..పవన్ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.