పవన్ కళ్యాణ్ ని సాఫ్ట్ ఎనిమీగా చేసిన చంద్రబాబు


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఏపీ సిఎం చంద్రబాబునాయడు వెనక్కి తగ్గారు. గతంలో పవన్ కళ్యాణ్ పై కంటిన్యూ ఎటాక్ వుండేది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సిఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్రంలో వున్న బెజెపి. ఈ నలుగురుని తమకు, రాష్ట్రానికి శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అయితే ఇప్పుడీ నలుగురుని నుండి జనసేన అధినేత పవ కళ్యాణ్ ని తప్పించారు. పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళడం తగ్గించారు చంద్రబాబు.

పవన్ కళ్యాణ్ సాఫ్ట్ ఎనిమీ:

పవన్ కళ్యాణ్ విషయంలో ఇపుడు చంద్రబాబు సాఫ్ట్ ఎనిమీ పాలసీని అనుసరిస్తున్నారు. అంటే మిగతా వాళ్ళని శత్రువుగా చూపించి దెబ్బ తీస్తే.. పవన్ కళ్యాణ్ ని మాత్రం శత్రువుగా చూపించకుండా దెబ్బతీయడం. పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరి ఇప్పటికే చాలా మందికి తెలుసు. వైజాగ్ లో సభపెట్టి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీని టార్గెట్ చేశారో అప్పటి నుండి సీన్ రివర్స్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ కి మీడియాలో కవరేజీ తగ్గించేశారు. స్వయంగా చంద్రబాబు, మంత్రి లోకేష్ లు పవన్ కళ్యాణ్ పై ఎటాక్ కి దిగారు. పవన్ కళ్యాణ్, జగన్, మోడీ తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు ధోరణి మారిపోయింది.

సామాజిక వర్గ హెచ్చరికలు:

పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు వైఖరి మారడానికి కారణం.. సామాజిక వర్గ హెచ్చరికలని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ని ఇలాగే టార్గెట్ చేసుకుంటే పొతే.. ఆయన సామాజిక వర్గం టీడీపీకి దూరం అయిపోతుందన్న రిపోర్ట్స్ చంద్రబాబుకి అందాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు టార్గెట్ చేశారో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ వంటరిని చేయడం ఆయన సామాజిక వర్గం గమనించింది. అప్పటివరకూ పవన్ కళ్యాణ్ ని హీరోగా కీర్తించిన చంద్రబాబు, ఆయన మీడియా ఒక్కసారి పవన్ కళ్యాణ్ కి కవరేజి ఇవ్వడం ఆపేసింది. దిని ద్వారా తామేదో సాధించామని అనుకున్నారు కానీ క్రమంగా చంద్రబాబుకు తెలిసొచ్చింది. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం నుండి బాబుపై వ్యతిరేకత పెరిగింది. తమ వాడిని వంటరిని చేశారనే సంగతి కిందస్థాయి వరకూ వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ కు ఆయన వర్గంలో మరింత పట్టు, సింపతి పెరిగాయి. ఇక్కడ చంద్రబాబు చేస్తున్న ఎటాక్.. పవన్ కళ్యాణ్ కి కలిసొచ్చిందే కానీ నష్టం చేయలేదు. ఇది గ్రహించారు చంద్రబాబు.
చంద్రబాబు ఎత్తుగడలకి పడని పవన్ కళ్యాణ్ :

పవన్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుంటూ పొతే ఆయన సామజిక వర్గం దూరమైపొతుందని గ్రహించిన చంద్రబాబు.. మళ్ళీ పవన్ కళ్యాణ్ ని కలుపుకుంటే ఒక పనైపొతుంది కదా అని ప్లాన్ వేశారు. ముందుగా తెరవెనుక మంతనాలు చేస్తే పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. తర్వాత తెరముందు.. పిలుపు, అభ్యర్ధన , బ్రతిమలాడటం చేశారు చంద్రబాబు. కానీ ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ చలించలేదు. తన మాట మీదే నిలబడివున్నారు. దీంతో ఇంక లాభం లేదనుకొని భావించిన చంద్రబాబు.. ఇక పవన్ కళ్యాణ్ ని సాఫ్ట్ ఎనీమిగా చేసే ప్లాన్ వేశారు.
చంద్రబాబు ట్యాక్టికల్ గేమ్ ప్లాన్ :

మొదట బిజెపి, జగన్ కేసీఆర్, పవన్.. ఈ నలుగురిని టార్గెట్ చేస్తూ వెళ్ళిన చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టారు. ఆయన్ని ప్రస్తావన్లోకి తీసుకురావడం లేదు. దిని ద్వారా పవన్ సామాజిక వర్గంలో ‘చూశారా.. పవన్ కళ్యాణ్ తో మేము సఖ్యత గానే వున్నాం’ అనే సంకేతాలు పంపిస్తున్నారు చంద్రబాబు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో దూకుడుగా వెళ్లి చెప్పినా కూడా అది మీడియాతో పెద్దగా హైలెట్ అవ్వడం లేదు. దానికి కవరేజ్ ఇవ్వడం లేదు చంద్రబాబు వర్గం మీడియా. వాళ్ళు అనుకున్న ప్రకారమే పవన్ కళ్యాణ్ ని ట్యాక్టికల్ గా దెబ్బతీయాలనే ప్లాన్ ను అనుసరిస్తున్నారు. దీనికి జనసేన తరుపు నుండి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ , శతజ్ని విభాగంతో పాటు స్వయంగా పవన్ కళ్యాణ్ ఎదురుదాడి చేస్తున్న కూడా చంద్రబాబు సైడ్ ట్యాక్టికల్ గేమ్ ఇక్కడ కుదరడం లేదు.
మరి ఈ పరిణామాలు బలాన్ని పెంచుతాయా? లేదా చంద్రబాబు ప్రభావమే పవన్ కళ్యాణ్ పై ఉండదా ? అన్నది ఎన్నికల తర్వాతే తేలుతుంది.