ప్రియాంక, మోడీకి తలనొప్పి కానుందా ?

మోడీ ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ పెద్ద షాక్ ఇవ్వబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి కొన్ని మీడియా సంస్థలు. అప్పుడెప్పుడో ఇందిరగాంధీ టైం లో జరిగిన పరిణామాన్ని బేస్ చేసుకొని ప్రియాంక పెద్ద యుద్ధమే చేయబోతుందంట. ఆ యుద్ధం ఎలా ఉండబోతుందంటే బోఫర్స్ తరహాలో ఉండబోతున్నట్లు , విపక్ష పార్టీలన్ని ఏకమై రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు.

అప్పుడెప్పుడో బోఫర్స్ లో తెలుగు దేశం పార్టీ తో పాటు జనతాదళ్ పార్టీ లు తమ రాజీనామా చేసారు. ఇప్పుడు మరోసారి అలాంటి రాజీనామాలే చేసి మోడీ కి పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాను మనీలాండరింగ్ కేసులో ఇరికించారు. దాంతో రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రా నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు..కావాలనే మోడీ తన భర్త ను ఈ కేసులో ఇరికించారని యుద్ధం చేయబోతుంది. కావాలనే ఈడీ తన భర్త ను విచారణ చేస్తున్నారని వాపోయింది. రాబర్ట్ వాద్రా కోసం ఇప్పుడు విపక్షాలన్నీ ఏకమై కేంద్రం ఫై యుద్ధం చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.