శిఖా చౌద‌రి కాదు మాధురి

కోస్టల్ బ్యాంకు అధినేత, ఎక్స్ ప్రెస్ టీవీ ఓనర్, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో శిఖా చౌద‌రి పేరు ఎక్కువగా విన్పిస్తుండడం తో అంత ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఈమెకు జయరాం హత్య కు సంబంధం ఏంటి..అసలు శిఖాఎవరు..? ఈ శిఖా పూర్తి పేరేంటి..అసలు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవాలని చాలామంది ఆసక్తికనపరుస్తున్నారు.

అసలు శిఖా చౌద‌రి పూర్తి పేరు ఏంటో తెలుసా..పులివేత్తుల మాధురి..హైదరాబాద్ వచ్చాక ఈమె పేరును శిఖా చౌద‌రి గా మార్చుకుంది. జయరాం దగ్గర చేరి ఆయన వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసేది..ఆలా చూస్తూ ఆయన చేత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టించేది..ఆ విషయం తెలుసుకున్న జయరాం భార్య చెక్ పవర్ ను తన ఆదీనంలో తీసుకుంది. దీంతో జయరాం కు నాలుగున్నర కోట్లు తనకు తెలిసిన రాకేష్ రెడ్డి తో ఇప్పించింది. అందులో నుండే తనకు కావాల్సిన విల్లా ను , ల్యాండ్ ను అలాగే ఖరీదయిన కారును జయరాం దగ్గరి నుండి గిఫ్ట్ గా పొందింది. ఆ తర్వాత జయరాం ఆ వడ్డీ లు కడుతూ వస్తున్నాడు. ఈ లోపు టీవీ కి మంచి బేరం రావడం తో దానిని అమ్మాలని అనుకున్నాడు. ఈ లోపే ఆయన హత్య కు గురైయ్యాడు.

గతంలోనే శిఖా కు రెండు పెళ్లిళ్లు జరిగాయి, ఇద్దరితో విడిపోయింది. మొదటి భర్తతో వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకోగా , రెండో భర్తతో విడిపోవడానికి కారణం రాకేశ్ రెడ్డితో తనకున్న సంబంధమే. రాకేశ్ రెడ్డితో డేటింగ్ లో ఉండడం వల్ల రెండో భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రాకేష్ ను పెళ్లి చేసుకుందామని అనుకుంది. కాకపోతే జయరాం తో అక్రమ సంబంధం నడుపుతుందని , తరుచు ఆయన విల్లా కు వస్తూ శిఖా తో కలవడం రాకేష్ కు నచ్చలేదు. ఈ వ్యవహారాలే జయరాం హత్య కు దారి తీసిందా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కేవలం తన విలాసాల కోసం శిఖా చేసిన పని ఇప్పుడు చాలామందిని రోడ్డున పడేసింది. ఇటు జయరాం ఫ్యామిలీ , అలాగే శిఖా ఫ్యామిలీ , రాకేష్ రెడ్డి మరికొంతమంది కూడా బయటకొస్తున్నారు. వారి ఫ్యామిలీలు సైతం ఇప్పుడు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. అది కేవలం శిఖా వల్ల.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.