మహేష్ తో టీడీపీ రాజకీయం..?

సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెప్పుకొని తెలుగుదేశం రాజకీయం చేస్తుందా..అంటే అవుననే అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. రాజకీయాలకు మహేష్ బాబు చాల దూరం. తన సినిమాలు ఏంటో..తన బిజినెస్ ఏంటో..తన కుటుంబం అంతే తప్ప మిగతా విషయాల గురించి పట్టించుకోరు. ఎంతమంది రాజకీయాల్లోకి రమ్మన్నా..కనీసం మద్దతు ఇవ్వమన్న కానీ నో అనే ముఖం మీదనే చెప్పేస్తాడు. అలాంటి మహేష్ ను ఇప్పుడు టీడీపీ వాడుకుంటుందని అంటున్నారు.

మహేష్ స్వయన బావ అయినా గల్లా జయదేవ్..ప్రస్తుతం తెలుగుదేశం బరిలో ఎన్నికలో నిల్చున్నాడు. ఈయన తరుపున ప్రచారం చేయాల్సిందిగా మహేష్ ను కోరారు..కానీ మహేష్ నో చెప్పాడు. దీంతో మహేష్ పేరును వాడుకోవాలని డిసైడ్ అయినా టీడీపీ..మహేష్ ఫై ఇటీవల జరుగుతున్న ఐటీ దాడులను రాజకీయం చేస్తూ సింపతీ ఓట్లు రాబట్టుకోవాలని చూస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి వారి మాటల్లోనే మీరే వినండి.