టీటీడీ ఆల‌యానికి ఫ్రీగా ఇవ్వలేరా…

రాజధాని ప్రాంతంలో దేవాలయాలకు , చర్చి లకు , మసీద్ లకు ఉచితంగా భూమి ఇవ్వడం , వాటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వడం మంచి పద్దతే..కానీ కోట్లాది మంది కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మాత్రం డబ్బులు అడగడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చ గా మారింది.

తాజాగా వెంకటాయపాలెం లో వెంకన్న సన్నిధాన నిర్మాణం కడుతున్నారు. దీనికి గాను ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం వారిని డబ్బు అడిగింది..అది కూడా ఎంతో తెలుసా ఎకరాకు అక్షరాలా 50 లక్షలు. మాములుగా అక్కడ సబ్ రిజిస్టర్ వేల్యూ ప్రకారం అంత లేదు. కానీ CRDA వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత పన్నెడున్నర కోట్లు పెట్టి స్థలాన్ని కొనిపించింది. ఇది ఎందుకు అని ఇప్పుడు అందరూ అడుగుతున్నారు.

చాలామందికి అక్కడి స్థలం ఎకరాకు 5 లక్షలకు ఇచ్చిన వారు..తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఎకరాకు 50 లక్షలు అడగడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బుంతా కట్టేది ఎవరో తెలుసా భక్తులే. రోజు దాదాపు కోటికి పైగా భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకొని తమ కానుకలను సమర్పిస్తుంటారు. అలాంటి వారి కానుకలను ఏపీ ప్రభుత్వం అడగడం ఇప్పుడు చర్చ గా మారింది. ఇది ఎక్కడి న్యాయం.. అన్ని మసీద్ లకు , చర్చి లకు ఫ్రీగా ఎలాంటి డబ్బు తీసుకోకుండా ఇస్తారు..వెంకన్న ఆలయం దగ్గరికి వచ్చేసరికి డబ్బు అడుగుతారా అని అంత ప్రశ్నిస్తున్నారు.

మిగతావారికి ఓకే న్యాయం..హిందువులకు ఒక న్యాయమా అని అక్కడి వారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇప్పటికే దీనిపై పిటిషన్ వేశారు..మరి ఆ పిటిషన్ కోర్ట్ చూసుకుంటుందనుకోండి..అసలు ఇలా ప్రభుత్వం ఎందుకు చేస్తుంది..ఏపీ ప్రభుత్వం ఎంత మోసం చేస్తుంటే తిరుమల దేవస్థాన ధర్మ కర్త ఏం చేస్తున్నాడు..ఈ మోసం లో ఆయనకు భాగస్వామ్యం ఉందా…? అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. మొత్తం మీద వెంకటాయపాలెం గుడి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.