వంశీ నిజంగా ఎదిరించారా ?

గన్నవరం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్న వంశీ నిజంగా ఎదిరించారా ?..ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ రాకముందు కొన్ని మీడియా సంస్థలు ఆంధ్ర నేతలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ లు బెదిరిస్తున్నారని..తెలంగాణ లో ఆంధ్ర నేతల ఆస్తులను చూపిస్తూ వారిని భయపెడుతున్నారని..తాము చెప్పినట్లు చేయకపోయినా..వినకపోయిన తెలంగాణ లో మీ ఆస్తులు ఒక్కటి కూడా ఉండవని..మరికొన్ని వాటిని చూపిస్తూ కేసీఆర్ బెదిరించారని కొన్ని వార్తలు బయటకొచ్చాయి.

అంతే కాదు ఇటీవల వైసీపీ పార్టీ లో తెలుగుదేశం నేతలంత చేరడం వెనుక కూడా కేసీఆర్ బెదిరింపులు ఉన్నాయని కూడా వార్తలు వినిపించాయి. అయితే కేసీఆర్ బెదిరించిన నేతల్లో వంశీ కూడా ఉన్నాడని..కేసీఆర్ బెదిరింపుల కారణంగా వంశీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసాయి.

ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ రావడం..అభ్యర్థుల ప్రకటన రావడం..అందులో గన్నవరం నుండి వంశీ పోటీ చేస్తుండడం బయటకు వచ్చాక..మరోరకంగా వంశీ ఫై వార్తలు ప్రచారం చేసారు..అదేలా అంటే కేసీఆర్ ఎంత బెదిరించిన వంశీ బెదరలేదని..కేసీఆర్ బెదిరింపులను వంశీ అసలు లెక్క చేయలేదని ..నిజంగా వంశీ ధీరుడని ఇలా ఎవరికీ వారు ప్రచారం చేసారు. మరి నిజంగా వంశీని కేసీఆర్ బెదిరించారా., అని వంశీ ని అడిగితే మాత్రం సమాధానం లేదు…మరి ఇది ఎలా బయటకువచ్చిందనేది రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి వారి మాటల్లోనే మీరే వినండి.