జగన్ కి ప్రభుత్వ ఉద్యోగులతో మద్దతు పెరుగుతుందా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చర్చ గా మారిన అంశం ప్రభుత్వ ఉద్యోగులు జగన్ కు మద్దతు ఇస్తున్నారా..అంటే అవుననే అంటున్నారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు వైఖరి ఫై కాస్త గుర్రుగా ఉన్నారు. దీనికి కారణం ఉద్యోగుల బదిలి స్థానాల ఫై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడమే.

రెండు రాష్ట్రాలు విడిపోయాకా తెలంగాణ ఉద్యోగులు ఆంధ్ర రాష్టం లో , ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఫ్యామిలీ లన్ని హైదరాబాద్ లో ఉంటె వారు మాత్రం ఆంధ్ర లో హాస్టల్ లలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

దీని ఫై చంద్రబాబు ఇంతవరకు నోరు మెదపడం లేదు. కేసీఆర్ , చంద్రబాబు ల మధ్య జరుగుతున్న గొడవ కారణం వల్లే ఇలా జరుగుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ వస్తే మన పరిస్థితి ఇలాగే ఉంటుందని , అందుకే జగన్ వస్తే మన సమస్య నెరవేరుతుందని భావిస్తున్నారన్నారట..

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.