నితిన్ న్యూడ్ ప్రచారం

నితిన్ తాజా సినిమా  `రంగ్ దే`. ఇదో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ట్రైలర్ లో అదే చూపించారు.  నితిన్ – కీర్తి సురేష్‌ల కెమిస్ట్రీ  బావుంది. ఈ సినిమాలో నితిన్ న్యూడ్ గా క‌నిపించ‌నున్నాడ‌ని ఓ రూమ‌ర్ ఉంది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో నితిన్ కూడా `అవును.. ఓ షాట్ లో అలా క‌నిపిస్తా` అని హింట్ ఇచ్చాడు.

అయితే.. అదేం న్యూస్ సీన్ కాదు. ఓ స‌న్నివేశంలో నితిన్ – కీర్తి…ల మ‌ధ్య ఇంటిమేట్ సీన్ ఒక‌టుంది. ట్రైల‌ర్ లోనూ దాన్ని చూపించారు.  ఆ స‌మ‌యంలో నితిన్ చొక్కా లేకుండా ఒకే ఒక్క షాట్ లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. దాన్నే నితిన్ `న్యూడ్` సీన్ అనేశాడు. వెబ్ సైట్స్ కూడా ఇలానే రాస్తున్నాయి. మరి చూడాలి ఈ న్యూడ్ ప్రమోషన్ ఎంత వరకూ కలిసొస్తుందో చూడాలి.