బాలీవుడ్ హీరో పై భారాన్ని పెంచిన నాని

జాతీయ పురస్కారాల్లో మన తెలుగు సినిమా మరోసారి సత్తా చాటింది. 2019కిగానూ నాలుగు పురస్కారాల్ని సొంతం చేసుకుంది. కథల పరంగానే కాకుండా.. సాంకేతికంగా కూడా మనం ముందడుగు వేస్తున్నామని రుజువు చేశాయి ఈ పురస్కారాలు. ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘జెర్సీ’ జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్నాయి.  

ఇందులో జెర్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘జెర్సీ’…  36 ఏళ్ల వయసున్న క్రికెటర్‌ అర్జున్‌ కథ ఇది. పదేళ్ల కిందట ఆగిపోయిన జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టి అనుకున్నది సాధించిన ఓ పరాజితుడి కథ.  కొడుకు దృష్టిలో ఎప్పుడూ హీరోగానే కనిపించాలని తపించిన ఓ తండ్రి కథ. అడుగడుగునా భావోద్వేగాల్ని పంచుతూ మనసుల్ని హత్తుకునే చిత్రమిది. తెరపై అచ్చంగా జీవితాల్ని చూసిన అనుభూతిని పంచుతుంది.  

ప్రస్తుతం పలు భాషల్లో రీమేక్‌ అవుతోంది జెర్సీ. హిందీలో సాహిద్ కపూర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి జాతీయ అవార్డ్ రావడం సాహిద్ పై ఒత్తిడి పెంచింది. ఈ ఈ విషయాన్ని స్వయంగా సాహిద్ చెప్పాడు, నాని తనపై ఒత్తిడి పెంచాడని అయినా ఈ భారాన్ని భారిస్తానని చెప్పాడు. మొత్తానికి జర్సీ రూపంలో సాహిద్ కి మరో హిట్ పడటం ఖాయంలా కనిపిస్తుంది.