రవితేజ లాయర్ కాదట

ఈ ఏడాది ఆరంభంలో ‘క్రాక్‌’ చిత్రంతో విజయం సాధించిన రవితేజ, ఇప్పుడు కొత్త చిత్రాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన కథానాయికలుగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతీలు నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత.

 ఈ చిత్రం తర్వాత రవితేజ – నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ఆర్టీ68’ వర్కింగ్‌ టైటిల్‌గా ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన లాయర్‌ పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఐతే  ఇందులో క్యారెక్టర్ లాయర్ కాదని  ఈ సినిమాలో రవితేజ బిజినెస్ మన్ గా కనిపించబోతున్నాడని టాక్ . అడ్డ దారులు తొక్కకుండా ఆర్గానిక్ గా ఎత్తుకు ఎదిగే  వ్యక్తిగా కనిపిస్తాడని టాక్.   సినిమా మొత్తం మిడిల్ క్లాస్ నుంచి ఆపైకి ఎదిగే క్రమంగా వుంటుందని టాక్.