రాయ్ లక్ష్మీ.. వాటే వాటే బ్యూటీ

రాయ్‌లక్ష్మి ఇండస్ట్రీకి వచ్చి పుస్కరకాలం దాటిపోయింది. కానీ హీరోయిన్ గా నిలబడలేకపోయింది. ఐతే ఇటీవల మళ్ళీ జోరులోకి వచ్చింది. క్రేజీ క్రేజీ ఐటెం సాంగ్స్ చేస్తూ.. బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేసింది లక్ష్మి. అదే జూలీ 2. అయితే ఈ సినిమా ఆడలేదు. ఇప్పుడు మరో ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న రాయ్ లక్ష్మీ .. తన ఫిజిక్ పై స్పెషల్ గా ఫోకస్ చేసింది, తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఇందులో సన్నగా తీగలాగ  వుంది.

పూర్తిగా సన్నబడింది. తన బాడీ మొత్తానికి చాలా కంట్రోల్ గా ఉంచుకుంది. ఇటివలే ఐటెం సాంగ్స్ చేస్తుంది రాయ్ లక్ష్మీ, కానీ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు ఇంకాస్త ఫోకస్ చేస్తూ ఫిజిక్ మీద ద్రుష్టి పెట్టింది. ప్రస్తుతం ఐతే ఆమె చేతిలో ఓ తమిళ సినిమా వుంది. తెలుగులో బాలయ్యతో ఓ ఐటెం సాంగ్ చర్చల్లో వుంది. కానీ ఆమెకు మాత్రం హీరోయిన్ గా అవకాశం కావాలి. మరి చూడాలి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో..