విజయ్ ఫ్యామిలీకి దగ్గర అవుతున్న రష్మిక !

రష్మిక , విజయ్ దేవర కుటుంబానికి దగ్గర అయ్యిందా ? అంటే అవుననే చెప్పాలి. గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో నటించి క్యూట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు విజయ్‌ దేవరకొండ, రష్మిక. తాజాగా విజయ్‌ దేవరకొండ ఇంట్లో జరిగిన ఓ పార్టీకి రష్మిక హాజరయ్యారు. తన తల్లి మాధవి 50వ పుట్టినరోజు వేడుకను విజయ్‌ తన ఇంట్లో వేడుకగా నిర్వహించారు.

అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్న ఈ కార్యక్రమంలో నటి రష్మిక తళుక్కున మెరిశారు. అనంతరం దేవరకొండ ఫ్యామిలీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా నెట్టింట్లో దర్శనమిచ్చాయి. విజయ్‌ ఫ్యామిలీతో రష్మికను చూసిన అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.