సునీల్ విలనా ! ఏంటీ కొత్త అవతారం ?

హాస్యనటులుగా తెరంగేట్రం చేసిన హాస్యనటులెందరో హీరో గా ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు మన తెలుగు చిత్ర సీమలో ఎన్నో ఉన్నాయి . నాటి అలీ దగ్గరనుండి నేటి సుడిగాలి సుధీర్ వరకూ అందరూ తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారే ,అయితే అందులో సక్సెస్ అయి హీరో గానే స్థిరపడిన వాళ్ళైతే ఎవరూ లేరనే చెప్పాలి . ఈ కోవలో సునీల్ చాలా ప్రత్యేకమని చెప్పాలి ‘అందాలరాముడు” తో హీరో గ ఫస్ట్ హిట్ కొట్టి ఏకంగా రాజమౌళి లాంటి డైరెక్టర్ చేతిలో పడి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా ఆతర్వాత హీరోగా అతని కెరీర్ నత్త నడక సాగుతుందని చెప్పాలి . ఈ క్రమంలో మళ్లీ కమెడియన్ గా తిరిగి రీఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్న సునీల్ సడన్ గా తన పాత్ మార్చుకున్నాడట .
తాజాగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా వివరాలను చిత్ర బృందం ప్రకటించింది. అమృత ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ‘కలర్‌ ఫోటో’ చిత్రంలో సునీల్‌ విలన్‌గా కనిపించనున్నారు. ‘మజిలీ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్‌ ఈ చిత్రంతో హీరోగా, యూట్యూబ్‌లో పాపులర్‌ అయిన సందీప్‌ రాజ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందిని చౌదరి కథానాయిక. సాయి రాజేశ్‌ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలు. ‘‘1995లో ఒక ఇంజనీరింగ్‌ కాలేజీలో జరిగే ప్రేమకథ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.మరి విలన్ గానైనా సునీల్ సక్సెస్ అవుతాడో లేదో చూడాలి