రోబో 2.0 తెలుగు హక్కుల లెక్క ఎంతో తేలింది..

ఇండియన్ సినిమా చరిత్ర లో కనివిని ఎరుగని రీతిలో రోబో 2 పాయింట్ ఓ చిత్రం తెరకెక్కుతుంది. రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ దాదాపు రూ. 540 కోట్ల తో ఈ సినిమాను నిర్మించింది. ప్రమోషన్ కూడా అదే తరహాలో చేస్తున్నారు ఇంత భారీ బడ్జెట్ తో సినిమా తీసి , దానిని ఎంత రేటుకు అమ్ముతారో, ఎవరు కొంటారో అంటూ అంత మాట్లాడుకున్నారు. కానీ ఈ రైట్స్ కొనేందుకు చాలామంది ముందుకొచ్చారు.

ఇక తెలుగు రైట్స్ విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ నిర్మాణ సంస్థ ఎన్వీఆర్ సినిమాస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. భారీ మొత్తానికే దక్కించుకున్నారనే వార్తలు వినిపించాయి కానీ ఎంతకు కొన్నాడో మాత్రం బయటకు తెలియరాలేదు. తాజాగా ఆ రైట్స్ లెక్క తేలింది. ఎన్వీప్రసాద్(తిరుపతి ప్రసాద్), దిల్ రాజు, యువి వంశీ కలిపి తెలుగు రాష్ట్రాల హక్కులను 72 కోట్ల రికవరబుల్ అడ్వాన్స్ కు తీసుకున్నారట. ఈసారి జిల్లాల వారీ హక్కులు అమ్మేయాలని ఈ ముగ్గురు అనుకుంటున్నారట.