67 వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ దక్కించుకున్న తెలుగు చిత్రాలు ఇవే..

67వ జాతీయ చలనచిత్ర అవార్డులను సోమవారం కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డ్స్ లో నాని జెర్సీ చిత్రానికి అలాగే మహేష్ బాబు మహర్షి చిత్రాలకు అవార్డ్స్ దక్కడం విశేషం. నాని నటించిన జెర్సీ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కగా.. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్ బాబు నటించిన మహర్షి నిలిచింది. ఇదే సినిమాకి ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును రాజు సుందరం గెలుచుకున్నారు.

ఇక మిగతా భాషల చిత్రాల విజేతల విషయానికి వస్తే ..

ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
ఉత్తమ ఎడిటర్ – జెర్సీ (నవీన్ నూలీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం (మహర్షి)
ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (మహర్షి)
ఉత్తమ నటుడు: ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాజ్‌పాయ్‌(భోంస్లే)
ఉత్తమ నటి: కంగనా రనౌత్ ‌(మణికర్ణిక/పంగా)
ఉత్తమ దర్శకుడు: బహత్తార్‌ హూరైన్‌
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది తాష్కెంట్‌ ఫైల్స్‌)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి (సూపర్‌ డీలక్స్‌)
ఉత్తమ చిత్రం(హిందీ): చిచ్చోరే
ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ
ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్‌
ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ (కన్నడ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ అరబ్ ‌(మలయాళం)
ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో
ఉత్తమ మేకప్‌: హెలెన్
ఉత్తమ గాయని: బర్దో (మరాఠీ)
ఉత్తమ గాయకుడు: కేసరి (తేరీ మిట్టీ)