వారం గ్యాప్ లో… !

nani1కుర్ర హీరోలలో లక్ ఉన్న హీరో ఎవరంటే నాని అని టక్కున సమాధానం వస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి అగుగిడిన నాని అష్టా చెమ్మా సినిమాతో హీరోగా టర్న్ అయ్యాడు. ఆ తర్వాత పిల్ల జమిందార్ సినిమాతో సక్సెస్ హీరోగా ముద్ర పడ్డ నాని కి 2013మాత్రం అంత కలిసిరాలేదు.ఏందుకంటే కృష్ణవంశీ దర్శకత్వంలో పైసా సినిమా చేసిన అది రిలీజ్ కష్టాలతో బయటకు రాకపోవడంతో ఆ సంవత్సరం అంతా ఒక్క సినిమా రిలీజ్ చేయలేకపోయాడు. అయితే ఆ లోటు ఈ సంవత్సరం మొదట్లోనే తీర్చుకోవడానికి నాని వారం గ్యాప్ లోనే రెండు సినిమాలను రిలీజ్ చేయనున్నాడు.

nani2నాని జండాపై కపిరాజు ఫిబ్రవరి 14న విడుదలకానుండగా, ఆహా కళ్యాణం ఫిబ్రవరి 7న మనముందుకురానుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ మొట్టమొదటి సారిగా దక్షనాదిన నిర్మిస్తున్న ఆహా కళ్యాణం బ్యాండ్ భాజా భారత్ కు రిమేక్. నానీ సరసన వాణికపూర్ నటిస్తోంది. ఈ సినిమా ఆడియో వేడుకను జనవరి 23న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అక్కినేని మరణంతో ఈ వారం ఇండస్ట్రీలో ఎటువంటి కార్యక్రమాలను జరపక పోవడంతో వాయిదా పడింది. త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.