అమలా ‘ఆడై’ రిలీజ్ డేట్..

అమలాపాల్ బోల్డ్ గా కనిపించి అందరికి పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చాల పద్దతిగా ఎక్కడ అందాల ఆరబోత కు పెద్ద తావివ్వకుండా లిప్ లాక్ వంటి హాట్ హాట్ సన్నివేశాలకు సైతం దూరంగా ఉన్న అమలా..తాజాగా బోల్డ్ గా కనిపించే సరికి అందరు అయోమయంలో పడ్డారు. ఏంటి నిజంగా అమలేనా..అంటూ ఒకటికి రెండు సార్లు చూడడం మొదలు పెట్టారు.

రత్నకుమార్ డైరెక్షన్లో అమలా పాల్ తాజాగా ‘ఆడై’ అనే సినిమా చేస్తుంది. దీని తాలూకా ఫస్ట్ లో టీజర్ లో ఒంటిమీద నూలు పోగు లేకుండా కనిపించి ఆశ్చర్య పరిచింది. ఈ ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. ఇక యూత్ అయితే ఈ టీజర్ చూసి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా..వెండితెర ఫై అమలా ను ఆలా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తి గా ఉన్నారు. అయితే వారి ఆసక్తి తగ్గట్లే సినిమాను జులై 19 న విడుదల చేయబోతున్నారు.

ఈ మేరకు అమ‌లాపాల్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట‌ర్ ద్వారా తెలిపింది. నేను పోరాడతాను .. నేను బ్రతికి ఉంటాను ..పెద్ద లేదా చిన్న అడ్డంకులు వస్తాయి.. నేను ప్రకాశిస్తాను.. నేను ఎత్తుకి ఎదుగుతాను.. వాటిని చూర్ణం చేసి దుమ్మును చెదరగొట్టండి..నేను విశ్వసించేది నా బలం మాత్రమే ..స్వేచ్ఛ మరియు ఆనందం కోసం నేను వృద్ధి చెందుతాను.. మీకు సంకల్పం ఉంటే, అప్పుడు ఎవరూ విఫలం కాలేరు .. ఇది నేను మాత్రమే, నా కథ అంటూ అమ‌లాపాల్ కామెంట్ పెట్టింది.

వి స్టూడియోస్ బ్యానర్ పై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ మూవీ కి ప్రదీప్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక తెలుగు వ‌ర్షెన్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియాల్సి ఉంది.