ఆది ఇంకొకటి మొదలెట్టాడు

ఆరంభంలో అదరగొట్టి తర్వాత డల్ అయిపోయాడు సాయి కుమార్ తనయుడు ఆది. తొలి రెండు చిత్రాలు ప్రేమకావాలి లవ్లీ బాగా ఆడాయి. తర్వాతే ట్రాక్ తప్పింది. ‘సుకుమారుడు’, ‘చుట్టాలబ్బాయ్‌’.. ఇలా వరుసగా ఫ్లాఫులు పడ్డాయి.

‘చుట్టాలబ్బాయ్‌’ తర్వాత ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేశాడు ఆది. విశ్వనాథ్‌ అరిగెల ఈ చిత్రానికి దర్శకుడు. కన్నడనటి శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. యూఎస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి, విజయ్‌లక్ష్మి నిర్మిస్తున్నారు.ఈ రోజు ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సాయికుమార్‌ పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీలావుంటే.. ‘శమంతకమణి’లో కూడా నటిస్తున్నాడు ఆది. మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌, సుధీర్‌బాబు, నారా రోహిత్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు.