ఎవర్ గ్రీన్ హీరో.. ఎన్నోశిఖరాలు

akkineni-nageswara-raoతెలుగువారి ’దసరా బుల్లోడు’ కన్నుమూశాడు. ’బుద్ధిమంతుడిగా’ మురిపించినా, దేవదాసుగా అలరించినా, ’దసరా బుల్లోడు’గా చిందేసినా అక్కినేని నటన అనన్యసామాన్యం. తెలుగుచిత్ర పరిశ్రమతో బహుదూర ’భాటసారి’గా పయనించిన అక్కినేని 256చిత్రాల్లో నటించారు. ఏ వేశాన్నైనా.. నాగేశ్వరరావుగారు రక్తికట్టిస్తారు అన్నది ఆయనపై అభిమానులకు వున్న నమ్మకం. తెలుగు చిత్ర పరిశ్రమలో డుయల్ రోల్ ప్లే చేసిన మొట్టమొదటి నటుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు. మారుమూల గ్రామం నుంచి తెలుగు చిత్రపరిశ్రకు దొరికిన ఆణిముత్యం అక్కినేని.. ఎన్నోశిఖరాలను అధిరోహించారు. ఎన్నో అవార్డులు.. అంతకు మించిన అభిమానుల ప్రేమాభిమానాలు అక్కినేని సొంతం.

అక్కినేని అందుకొన్న శిఖరాలు
– 1957 – నటసామ్రాట్
– 1968 – పద్ర శ్రీ
-1977 – కళా ప్రపూర్ణ
-1989 – రఘుపతి వెంకయ్య అవార్డు
-1997 – దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు
-1993 – గౌరవ డాక్టరేట్
-1995 – అన్నా అవార్డు (తమిళనాడు ప్రభుత్వం)
-1996 – ఎన్టీఆర్ జాతీయ అవార్డు
-1998 – పద్మభూషన్
-2011 – పద్మవిభూషన్
-2012 – తానా జీవిత సాఫల్య పురస్కారం
– మేఘ సందేశం, బంగారు కుంటుంబం చిత్రాలకు నంది అవార్డులు
– మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాసు కౌస్తుబౌ అవార్డు
నాలుగు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్
1968 (సుడిగుండాలు)
1973 (మరుపురాని మనిషి)
1991(సీతారామయ్య గారి మనవరాలు)
1994 (బంగారు కుటుంబం)