‘గబ్బర్’ మొదలైంది !

gabbarబాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ సల్మాన్ రూట్ ని ఫాలో అవుతున్నాడు..సల్మాన్ లాగే వరుస సౌత్ రీమేక్ లతో రెచ్చిపోతున్నాడు..2012లో తెలుగు విక్రమార్కుడు సినిమాని రౌడీ రాథోడ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన అక్షయ్ కి సౌత్ రీమేక్ లపై మంచి నమ్మకం ఏర్పడింది. అలాగే ప్రభుదేవా డైరెక్షన్లో రౌడీ రాథోడ్ ప్రొడ్యూస్ చేసిన సంజయ్ లీలా భన్సాలీ కి కూడా దక్షిణాది సినిమాలపై మంచి గురి కుదిరింది. దీంతో వీరిద్దరూ కలిసి ఇప్పుడు మరో తెలుగు రీమేక్ ని మొదలు పెట్టారు.

అక్షయ్ కుమార్ –సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ గబ్బర్ తెలుగులో సూపర్ హిట్ అయిన ఠాగూర్ హిందీ రీమేక్ గబ్బర్. చిరంజీవి శ్రీయ హీరో హీరోయిన్లుగా వివివినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఠాగూర్ మూవీ సూపర్ హిట్టైంది. తమిళ్ లో మురగదాస్ తెరకెక్కించిన రమణ రీమేక్ గా వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డ్ లని తిరగరాసింది.

asఈ మూవీ రీమేక్ రైట్స్ ని సంజయ్ లీలా భన్సాలీ సొంతం చేసుకున్నాడు.. ఈ మూవీ కోసం చాలా మంది డైరెక్టర్స్ పేర్లని పరిశీలించిన సంజయ్ చివరికి ఈ క్రేజీ ప్రోజెక్ట్ ని క్రిష్ కి అప్పగించాడు. గమ్యం వేదం,కృష్ణం వందే జగద్గురుమ్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఈ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు..

అక్షయ్ కుమార్ కి జోడీ గా శృతీహసన్ నటిస్తోన్న ఈ మూవీ ముంబైలో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపించే అక్షయ్ ఈ మూవీలో గడ్డంతో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు..అక్కీ బియర్డ్ లుక్ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మరి గబ్బర్ గా అక్షయ్ ఏ రేంజ్ లో హిట్ కొడ్తాడో తెలియాలంటే రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.