బిగ్‌బాస్‌ : అలీ ఎంట్రీపై విమర్శలు

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఇప్పటికే రెండు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు వచ్చాయి. మొదట తమన్నా సింహాద్రీ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వగా ఆమె రెండు వారాలు కూడా పూర్తిగా ఉండకుండానే వెళ్లి పోయింది. ఆ తర్వాత వచ్చిన శిల్ప చక్రవర్తి కూడా రెండు వారాలు పూర్తిగా ఉండకుండానే వెళ్లి పోయింది. వారిద్దరి వైల్డ్‌ ఎంట్రీ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఇప్పుడు మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా అలీ రెజానా పంపించడం జరిగింది. ఈయన ఏడవ వారంలో ఎలిమినేషన్‌ అయిన విషయం తెల్సిందే.

అలీ రెజీ ఎలిమినేట్‌ అవ్వడంపై కొందరు మండి పడ్డారు. అలీ రెజా మళ్లీ ఇంట్లోకి పంపించాల్సిందే అంటూ చాలా మంది డిమాండ్‌ చేశారు. కాని ఇప్పుడు అలీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇలా ఇంట్లోంచి బటయకు వెళ్లిన వ్యక్తిని మళ్లీ ఎలా రీ ఎంట్రీ ఇప్పిస్తారంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. గత సీజన్‌లోనే నూతన్‌ నాయుడు మరియు శ్యామల విషయంలో తప్పు చేశారు. ఈసారి మళ్లీ తప్పు చేశారు. ఇంట్లో ఇన్ని రోజులుగా కష్టపడ్డ వారి విషయంలో ఇది ద్రోహం అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.