బన్నీకి బలిసిందా ? బీ కేర్ ఫుల్ బ్రదర్ !!

allu arjun
అల్లు అర్జున్ కి ఏమైందో తెలీదు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే చాలు. ‘ఆపండి . నేను పవన్ గురించి మాట్లాడను. థట్సాల్” అని ఘాటు సమాధనం ఇస్తున్నాడు. మొన్న సరైనోడు బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో ఇదే జరిగింది. పవన్ గురించి మాట్లాడాలని ఫ్యాన్స్ కోరితే.. ‘మాట్లాడను బ్రదర్’ అని తేల్చిపారేశాడు. దీనిపై పవన్ అభిమానులు గరమ్ అయ్యారు. ‘టన్నుల కొద్దీ ఉన్న దమ్మంతా పోయి.. దద్దమ్మలుగా మిగిలిపోతారు జాగ్రత్త’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ ఎపిసోడ్ అలా కొనసాగుతూవుండగా మళ్లీ పవన్ ఫ్యాన్స్ ను హార్ట్ చేశాడు బన్నీ.

సరైనోడు సక్సెస్ మీట్ లో బాగంగా ఓ పాపులర్ మీడియా చానల్ కు ఇంటర్ వ్యూ ఇచ్చిన బన్నీ.. ‘పవన్‌ గురించి మాట్లాడను బ్రదర్‌’ అన్నారు. ఎందుకు అలా అనాల్సివచ్చింది? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మళ్లీ ఘాటు సమాధనం ఇచ్చాడు బన్నీ. ”మళ్లీ చెప్తున్నా. పవన్ గురించి మాట్లాడను. ఈ ప్రశ్న తప్ప ఇంకేదైనా అడగండి బ్రదర్” అని ఆన్సర్ చేశాడు.

ఇది మళ్లీ పవన్ అభిమానులను హార్ట్ చేసింది. దీనిపై ఈసారి కాస్త ఘాటుగా స్పదించారు. ”అంత బలుపు పనికి రాదు బాబు. బీ కేర్ ఫుల్ బ్రదర్. నీకు టన్నుల టన్నుల బలుపు పెరిగినట్లు వుంది” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొందరు. మెగా ఫ్యాన్స్ పేజీలుగా కనిపిస్తున్న ఈ కామెంట్లు ఎవరో పెడుతున్నారో కానీ ఓ రేంజ్ లో బన్నీపై విరుచుకుపడుతున్నారు.

ఐయినా బన్నీకి ఈ పట్టుదల ఏమిటో.. ? ఏదో ఒకటి మాట్లాదేస్తే పోయేది. అనవసరమైన గోల గానీ.!!