అల్లు అర్జున్ కు ఏమయ్యింది..?

Allu-Arjun-Shockవారం కిందట వరకు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్ ‘ వ్యవహారం పెద్ద దుమారం లేపిన సంగతి తెలిసింది…మెగా ఫ్యామిలీ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బన్నీ ఇలా పవన్ కళ్యాణ్ గురించి చెప్పకపోవడం ఏంటి..? పక్క హీరోలను కానీ ఇతర నటి నటులను గాని పవన్ గురించి చెప్పమంటే దేవుడిగా చెపుతారు..అలాంటిది బన్నీ మాత్రం చెప్పను అనడం ఏంటి అని అందరు ప్రశ్నిస్తున్నారు..

ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే మాట మరోసారి అని సంచలనం లేపాడు..పవన్ కళ్యాణ్ గురించి తప్ప మీరు ఏదయినా అడగండి సమాదానం చెపుతా..అంతే కానీ పవన్ గురించి ‘చెప్పను బ్రదర్ ‘ అని అనడం తో మరోసారి పవన్ ఫ్యాన్స్ , బన్నీ ఫై కోపం తో ఊగిపోతున్నారు..ఇంతకి పవన్ ఫై బన్నీ కి ఎందుకో కోపం వచ్చింది..పవన్ గురించి చెప్పడానికి ఎందుకు ఇష్ట పడడం లేదు..అనేది సాదారణ ప్రేక్షకుడి అనుమానం..మరి ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో..? ఎప్పటికి సర్దుమనుగుతుందో చూడాలి.