నగ్నంగా 20 రోజులు ఉందట..

అమలా పాల్..ఈ పేరు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ లలో హాట్ టాపిక్ అయ్యింది. దీనికి కారణం ఆమె న్యూడ్ గా కనిపించడమే..సినిమా కోసం ఎంతో కష్టపడతారని తెలుసు..కానీ అదే సినిమా కోసం ఇలా ఒంటి మీద నూలు పోగు లేకుండా నటించడం అనేది చాల గ్రేట్.

రత్నకుమార్ డైరెక్షన్లో అమలా పాల్ తాజాగా ‘ఆడై’ అనే సినిమా చేస్తుంది. దీని తాలూకా ఫస్ట్ లో టీజర్ రీసెంట్ గా విడుదల అయ్యింది. టీజర్ మొత్తం ఒక సస్పెన్స్ థ్రిలర్ గా సాగగా… ఆఖర్లో అమలా బోల్డ్‌గా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. సినిమా కోసం, పాత్ర కోసం అమలాపాల్ ఇలాంటి ధైర్యం చేయడం పట్ల అందరూ మెచ్చుకుంటున్నారు.

ఆ సన్నివేశాల కోసం అమలాపాల్‌ 20 రోజులు దుస్తుల్లేకుండా నటించిందట. ఇది సాధారణ విషయం కాదు. అందుకు అమలాపాల్‌ ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు మిలియన్ల ప్రేక్షకులు వీక్షించడం విశేషం. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్‌ ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది.