జెర్సీ రీమేక్ లో అమలా..?

నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ జెర్సీ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై క్రికెట్- మిడిల్ క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు నాట హిట్ టాక్ తెచ్చుకొని..మంచి కలెక్షన్లు రాబట్టింది. అందుకే ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అందులో భాగంగా ఈ సినిమాను తమిళంలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. ఇందులో హీరో పాత్ర కోసం తమిళ నటుడు విష్ణు విశాల్‌ను సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్‌ చేసిన పాత్రను తమిళంలో అమలాపాల్‌ చేయనున్నట్లు ప్రస్తుతం కోలివుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఒకవేళ జెర్సీ తమిళ రీమేక్‌లో కనుక అమలాపాల్‌ నటిస్తే… విష్ణు విశాల్‌, అమలాపాల్‌ కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా అవుతుంది. ఇప్పటికే ఈ జంట కోలీవుడ్‌లో విజయం సాధించిన రాక్షసన్‌ సినిమాలో కలిసి నటించారు. ఇక జెర్సీ తమిళ రీమేక్‌ను నిర్మించేందుకు రానా దగ్గుబాటి ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.