అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే తప్పేముంది..?

అమలా పాల్ ఆమె సినిమాను వినూత్నంగా ప్రచారం చేసేస్తుంది. తాజాగా తాను ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకుంటే.. అందులో తప్పేముంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు అమలాపాల్‌. అమలా టైటిల్‌ రోల్‌లో నటించిన సినిమా ‘ఆమె’. రత్న కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అమలాపాల్‌ నగ్నంగా కనిపించారు. ఆమె పాత్ర కూడా విభిన్నంగా దర్శనమిస్తుంది. ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

అదేవిధంగా తాజాగా ట్రైలర్‌లో అమలాపాల్‌ తన సహనటి ఆర్జే రమ్యను ముద్దుపెట్టుకుంటూ కనిపించారు. ఇది సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఈ ముద్దు సన్నివేశంపై మీడియా తాజాగా అమలాపాల్‌ను ప్రశ్నించింది. ఇందుకు ఆమె స్పందిస్తూ.. ‘ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకుంటే…  తప్పేంటి? ఆ షాట్‌ అనుకోకుండా వచ్చింది.. అది స్క్రిప్టులో లేదు. ఓసారి పాత్రలో లీనమైతే.. ఇక మన స్వభావాన్ని పక్కన పెట్టినట్లే. ఈ సినిమా శృగారం పరమైనది కాదు. ఇందులో కంటెంట్‌ అర్థం కావాలంటే.. సినిమా తప్పక చూడాల్సిందే.

అంతేకాకుండా ఈ సినిమాతో నటిగా నాకు మంచి గుర్తింపు తెస్తుంది. మొదట ఆ సన్నివేశాల్లో ఎలా నటించాలని ఆలోచించాను.. కానీ ఓసారి కెమెరా ముందుకు వెళ్లిన తర్వాత.. సౌకర్యంగానే అనిపించింది. ఇప్పుడు తనకు ఈ ప్రపంచంలోని ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలననే నమ్మకం ఏర్పడింది. ఈ సినిమాకు సంతకం చేయడానికి ముందే నగ్న సన్నివేశాలపై తాను మా అమ్మకు చెప్పానని.. అలాంటి సీన్లు స్క్రిప్టుకు కచ్చితంగా అవసరం అనిపిస్తే నటించమని అన్నట్లు అమలా వివరించారు.