ఎర్రబస్సునుండి దిగిన అంజలి … ఊర్లోకి వస్తుందా ?


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన హీరోయిన్ అంజలి. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలని ఎక్కువగా చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్న అంజలికి ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో సాలిడ్ మార్కెట్ ఉంది. తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు, వెబ్ సీరీస్ లు చేస్తూ బిజీగా ఉన్న అంజలి ప్రస్తుతం ‘బహిష్కరణ’ అనే వెబ్ సీరీస్ చేస్తోంది. ముఖేష్ ప్రజాపతి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ జీ5లో రిలీజ్ కానుంది. జులై మూడో వారంలో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ వెబ్ సీరీస్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. అంజలి బర్త్ డే సందర్భంగా, ఫాన్స్ కి స్పెషల్ గిఫ్ట్ గా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి వచ్చింది. ఎర్ర బస్సు దిగి ఊరిలోకి వస్తున్న పక్కా పల్లెటూరి అమ్మాయిలాగా అంజలి కనిపించింది.

పోస్టర్ లో అంజలి ముందు ఉన్న కంచెల్ని ఆమె ఎలా దాటుతుంది అనే విషయాన్నీ దర్శకుడు పోస్టర్ తోనే చెప్పే ప్రయత్నం చేసినట్లు ఉన్నాడు. అంజలి లుక్ చాలా అట్రాక్టివ్ గా హోమ్లీగా ఉంది. అయితే గతేడాది ఇదే బహిష్కరణ టీమ్ నుంచి వదిలిన పోస్టర్ లో అంజలి చాలా గ్లామర్ లుక్ లో కనిపించింది. ఈ రెండు పోస్టర్స్ లో చాలా డిఫరెన్స్ ఉంది, ఒకటి పూర్తిగా హోమ్లీగా ఉంటే ఇంకొకటి గ్లామర్ గా ఉంది. ఈ రెండు వేరియేషన్స్ అంజలి పాత్రలో ఉండే అవకాశం ఉంది. అంజలి ఫాన్స్ బహిష్కరణ పోస్టర్ ని షేర్ చేస్తూ అంజలికి బర్త్  డే విషెష్ కన్వే చేస్తున్నారు.