అక్కినేని చివ‌రి క్షణాలు ఎలా గ‌డిచాయి?

ANR-finalకేన్సర్ అని తెలిసి… ప్రెస్‌ మీట్ పెట్టి ఆ సంగ‌తి లోకానికి తెలిసేలా చేయ‌డం – ఏఎన్నార్ మ‌నో నిబ్బరానికి తార్కాణం. చివ‌రి క్షణాల వ‌ర‌కూ అక్కినేని ఇదే ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో బతికారు. ప‌ల‌క‌రింపులు, ప‌రామ‌ర్శల‌తో గుండె బ‌రువు పెంచుకోవ‌డం ఆయ‌న‌కు ఇష్టం లేదు. అందుకే త‌న నివాసంలో చివ‌రి క్షణాల వ‌ర‌కూ ప్రశాంతంగా గ‌డిపారు. ఈమ‌ధ్య టీవీలో సినిమాలు బాగానే చూశార‌ట‌. అత్తారింటికి దారేది, న‌మో వెంక‌టేశ‌…లాంటి వినోదాత్మక చిత్రాల‌తో కాల‌క్షేపం చేశారు. కామిక్ ఛాన‌ళ్లు చూశారు…. హాయిగా న‌వ్వుకొన్నారు. `మా తాత‌గారు వీలైనంత ఎక్కువ‌గా సినిమాలు చూస్తున్నారు. ఫ‌లానా సినిమా బాగుంద‌ట‌. తీసుకురా అనేవారు. నేను సినిమాల పిచ్చోడిని. కానీ తాత‌గారు నాకంటే ఎక్కవ సినిమాలు చూశారు… అంటున్నారు సుమంత్‌. అక్కినేని చివ‌రి క్షణాల వ‌ర‌కూ ఆయ‌న‌తోనే గ‌డిపారు సుమంత్‌! మ‌ర‌ణించే ముందు రోజు కూడా కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా మాట్లాడార‌ట‌. లోలోప‌ల క్యాన్సర్ తినేస్తున్నా ఆ బాధ‌ను దిగ‌మింగుకొని న‌వ్వుతూ.. న‌వ్విస్తూ ఇంట్లోవాళ్లను సంతోష‌పెట్టార‌ట‌. అంద‌కే అనేది.. ఏఎన్నార్ గ్రేట్‌.