అక్కినేని ఆరోగ్యం ఎలా ఉంది?

sఏఎన్నార్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి అభిమానులు బెంగ పెట్టేసుకొన్నారు. అక్కినేని ప‌రిస్థితి విష‌యంగా ఉంద‌ని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. వెబ్ మీడియా హ‌ద్దు మీరి స్పందించ‌డంతో అక్కినేని అభిమానుల్లో క‌ల‌క‌లం రేగింది. అయితే అక్కినేని ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని.. అక్కినేని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఇప్పుడు తాత‌య్య ఆరోగ్యంపై సుమంత్ ఓ వివ‌ర‌ణ ఇచ్చాడు. ”తాత‌య్య ఆరోగ్యం బాగానే ఉంది. ఇది వ‌ర‌క‌టిలా ఉత్సాహంగా ఉన్నార‌ని చెప్పడానికి లేదు. అలాగ‌ని మ‌రీ దారుణంగా లేదు. జ‌స్ట్ ఒకే అని మాత్రమే చెప్పగ‌ల‌ను. ప్రస్తుతం నేను ఆయ‌న‌తోనే ఎక్కవ స‌మ‌యం గ‌డుపుతున్నా” అని చెప్పారు సుమంత్‌.