పిక్ టాక్ : స్వీటీ సన్నబడింది

anushka (11)
గ్లామర్ తో ఆదరగోట్టాలన్నా, హీరోయినిజం పండించాలన్న స్వీటీ అనుష్క కె చెల్లింది. అయితే గత కొంత కాలంగా డీగ్లామర్ పాత్రలకే పరిమితమైయింది జేజమ్మ. బాహుబలిలో అనుష్క ఓల్డ్ షెడ్ నే చూపించారు.’సైజ్ జీరో’విషయానికి వస్తే పాత్రకోసం మరీ లావుగా తయారైయింది. అయితే ఇప్పుడు మళ్లీ నాజుకు అందానికి వచ్చేసింది జేజమ్మ. ఆమె ట్విట్టర్ పెట్టిన ఫోటోనే దీనికి సాక్ష్యం. బాహుబలి2 యువరాణి దేవసేనగా స్వీటీ కనిపించనున్న సంగతి తెలిసిందే. దీని కోసం గత కొన్ని నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్న అనుష్క.. ఇప్పుడు నాజూకు సోయగాన్ని పొందింది. ఈ విషయాన్ని స్వీటీ చెప్పకపోయినా, ఫోటో లో ఆమె పేస్ కట్ చెప్పకనే చెబుతోంది.