మెగాహీరోల్ని వ‌ద‌ల‌డా?

boyapati
యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా బోయ‌పాటి శ్రీ‌నుకు కావ‌ల్సినంత పేరుంది. లెజెండ్‌తో మ‌రో సూప‌ర్ హిట్ కొట్టి…. హీరోల్ని, ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్నీ మ‌ళ్లీ ఆక‌ర్షించాడు. అయితే.. మెగా హీరోల‌తో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేయి జారిపోతోంది. ముందు రాంచ‌ర‌ణ్‌తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఎందువ‌ల్లో అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ త‌ర‌వాత అల్లు అర్జున్‌తో అనుకొన్నాడు. అదీ కార్య‌రూపం దాల‌చ్చ‌లేదు. ఇప్పుడు మ‌రో మెగాహీరోకి క‌థ వినిపించే ప‌నిలో ప‌డ్డాడు. నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఆ త‌ర‌వాత‌.. బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేసే అవ‌కాశాలున్న‌ట్టు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సి. క‌ల్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ట‌. మొత్తానికి మెగాహీరోల‌తో సినిమా చేసే అవ‌కాశాన్ని మాత్రం వ‌దులుకోలేదు శ్రీ‌ను..