బన్నీ తో జెర్సీ డైరెక్టర్ ..?

నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ జెర్సీ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై క్రికెట్- మిడిల్ క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు నాట హిట్ టాక్ తెచ్చుకొని..మంచి కలెక్షన్లు రాబట్టింది. అందుకే ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని దిల్ రాజు , అల్లు అరవింద్ కలిసి రీమేక్ చేయబోతున్నారు.

ఈ రీమేక్ లో షాహిద్ క‌పూర్ హీరోగా నటిస్తున్నాడు. హిందీ లో కూడా గౌతమ్ నే డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ తర్వాత బన్నీ తో ఓ సినిమా చేయాలనీ గౌతమ్ సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బన్నీ కోసం ఓ కథ సిద్ధంచేసాడట. త్వరలోనే ఆయనకు వినిపించి ఓకే చేయించుకోవాలని చూస్తున్నాడట. మరి బన్నీ మెచ్చే కథ రాసుకున్నాడో లేదో చూడాలి.