చాణక్య ట్రైలర్ టాక్

గోపిచంద్, మెహ‌్రీన్ జంట‌గా యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన చిత్రం ‘చాణక్య‌’. తమిళ దర్శకుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రీసెంట్ గా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి సినిమా ఫై ఆసక్తి పెంచగా..తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ సినిమా ఫై అంచనాలు పెంచారు. ట్రైలర్ మొత్తం కూడా చాల స్టైలిష్ గా ఉంది. యాక్షన్ సన్నివేశాలు , ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు ఇలా అని మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇండియన్ రా ఏజెంట్ పాకిస్తాన్ వెళ్లి అక్కడేం చేసాడు అనేది ఈ చిత్ర కథ అన్నట్లు తెలుస్తుంది. ‘లౌక్యం’ తర్వాత సరైన హిట్టు లేని గోపీచంద్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని కలలు కంటున్నాడు. మరి ఆ కలలు నెరవేరుతాయో లేదో చూడాలి. ఈ లోపు మీరు ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.