చరణ్ సినిమాకి బీహారీ బ్యాక్డ్రాప్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమాఇటివలే ప్రారంభమైంది.తొలి షెడ్యుల్ కూడా డు పూర్తయింది. కాగ సినిమాకు రాజస్థానీ నేపధ్యం వుందని ఆ మధ్య వార్తలు వినవచ్చాయి. కానీ అసలు విషయం అదికాదట.

సినిమా విలన్ వ్యవహారం అంతా బీహారీ నేపథ్యంలో వుంటుందట. సినిమాలో కాస్త చెప్పుకోదగ్గ భాగమే బీహారీ నేఫథ్యంలో సాగుతుందట. ఆ సీన్లను అన్నీ బోయపాటి స్టయిల్ లో చాలా అంటే చాలా భారీగా వుంటాయట. అందుకోసం ఇక్కడ కొన్ని సెట్ లు వేసి, కొన్ని అక్కడ లోకేషన్లలో చిత్రీకరిస్తున్నారు

ఈ సినిమా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకోపక్క రామ్ చరణ్ ‘రంగస్థలం’ ఫినిష్ చేసేపనిలో వున్నాడు. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల మధ్యకు రానుంది.