బోయపాటి సినిమాకు సిద్దమైన చిట్టిబాబు…

చిట్టిబాబు గా రంగస్థలం లో అదరగొట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఓ యాక్షన్ మూవీ కి సిద్ధం అయ్యాడు. గత నెలలో చిత్ర ఓపెనింగ్ కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ , ఈ నెల చివరి వారం లో చరణ్ సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడు. ఒక షెడ్యూల్
చరణ్ లేకుండానే పూర్తి చేసాడు బోయపాటి.

దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. ఇక రంగస్థలం విషయానికి వస్తే..మగధీర తర్వాత చరణ్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ గా రంగస్థలం నిలిచింది. ఇంత సూపర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకుల కు థాంక్స్ చెప్పేందుకు చిత్ర యూనిట్ రేపు సక్సెస్ మీట్ ఏర్పటు చేసారు.