వినాయ‌క్ త‌ప్పుకొన్నాడా?

vv vinayak
చిరంజీవి సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?? ఈ ప్ర‌శ్న చాలాకాలం నుంచి ఎదుర‌వుతూనే ఉంది. చిరు అభిమానుల్ని సంతృప్తి ప‌రిచిన స‌మాధానం… వి.వి.వినాయ‌క్‌. చిరు కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు వినాయ‌క్‌. చిరు, చ‌ర‌ణ్‌, బ‌న్నీల‌తో సినిమాలు చేశాడు. హిట్టూ ఇచ్చాడు. అందుకే వినాయ‌క్ అయితేనే… ఈ సినిమాకి న్యాయం చేయగ‌ల‌డ‌ని అభిమానులు గ‌ట్టిగా ఫిక్స‌య్యారు. వినాయ‌క్ కూడా కొంతకాలంగా చిరుకి క‌థ‌లు వినిపించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇంట‌ర్వ్యూల‌లో కూడా చిరు సినిమాకి డైరెక్ట్ చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి వినాయ‌క్ త‌ప్పుకొన్నాడ‌ని తెలుస్తోంది. ”ఎవ‌రు మంచి క‌థ‌తో వ‌స్తే.. వాళ్ల‌కే డైరెక్ష‌న్ ఛాన్స్‌” అని చిరు కూడా ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పారు. అంటే ఈ రేసులో ఎవ‌రికైనా ఛాన్స్ ఉంద‌న్న‌మాట‌. వినాయ‌క్‌కి ఈ సినిమా చేసే ఛాన్స్ ఎంత ఉందో, మిగిలిన స్టార్ ద‌ర్శ‌కుల‌కూ అంతే ఉంద‌ని… మెగా కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వినాయ‌క్ కీ క‌థ‌లు వినిపించీ, వినిపించీ విసుగొచ్చేసి ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకొంటేనే మేల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి.