ఫైట్ తో చరణ్ ఎంట్రీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా ఇటివలే ప్రారంభమైంది. తొలి షెడ్యుల్ కూడా పూర్తయింది. అయితే ఇది చరణ్ లేకుండానే. ఇప్పుడు చరణ్ ఎంట్రీ ఇస్తున్నాడు,

ఈ నెల 6 నుంచి చ‌ర‌ణ్ రంగంలోకి దిగుతున్నాడు. అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఓ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి.

బోయ‌పాటి సినిమాల్లో యాక్ష‌న్ సీన్లంటే ఏ రేంజులో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. చ‌ర‌ణ్ బాడీ లాంగ్వేజ్‌ని దృష్టిలో ఉంచుకొని, ప‌వ‌ర్ ఫుల్‌గా ఈ యాక్ష‌న్ సీన్లు రూపొందిస్తున్నార్ట‌ . ఈ సినిమా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు