కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యముగా సినీ, రాజకీయనేతలు ఎక్కువ సంఖ్యలో పడుతుండడం కార్య కర్తల్లో , అభిమానుల్లో కలవరపెడుతుంది. ఇక చిత్ర సీమా విషయానికి వస్తే ఇప్పటికే అగ్ర దర్శకులు , నిర్మాతలు , నటి నటులు దీనిబారిన పడగా..కొంతమంది క్షేమంగా బయటపడ్డారు. మరికొంతమందికి దీనికి బలయ్యారు.
తాజాగా టీవీ సెలబ్రిటీ సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడ్డారనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. అక్టోబర్ 18న అతడికి కరోనా సోకినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న అతడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయంపై సుధీర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.