‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ముహూర్తం ఫిక్స్ !

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథనాయకులుగారాజ‌మౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి అఫిషియల్ ఇప్పటి వరకు సింగిల్ పిక్ కూడా రాలేదు. కానీ, ఒకట్రెండు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. వైరల్ అయ్యాయి. తాజాగా ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్  రిలీజ్ కి ముహూర్తం ఫిక్సయినట్టు సమాచారమ్.

మార్చి 27న రామ్ చ‌ర‌ణ్ పుట్టినరోజు సందర్భంగా.. సినిమా టైటిల్‌తో పాటు రామ్ చ‌ర‌ణ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఆర్ ఆర్ ఆర్ తెలుగు టైటిల్ గా ‘ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం’ ఫీక్సయినట్టు సమాచారమ్. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. కొమరంభీమ్ గా తారక్ నటిస్తున్నారు. ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తొంది. అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.