అక్కడ డియర్ కామ్రేడ్ దుమ్ములేపుతుంది..

గీత గోవిందం ఫేమ్ విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం తెలుగు, తమిళ్ , కన్నడ భాషల్లో విడుదలై భారీ ప్లాప్ అందుకున్న సంగతి తెలిసిందే. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ ఎత్తున నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను , అభిమానులను బాగా నిరాశ పరిచింది.

కానీ హిందీ ప్రేక్షకులను మాత్రం ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది. హిందీలో మన హీరోలు, సినిమాలకు ఉన్న క్రేజ్‌ చూసి తెలుగు సినిమాలను అనువాదం చేసి యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు అనువాద చిత్రాలు రికార్డు వ్యూస్ రాబట్టగా..ఈ జాబితాలో డియర్ కామ్రేడ్ చేరింది. గోల్డ్‌మైన్స్ టెలీఫిలింస్ సంస్థ ‘డియర్ కామ్రేడ్’ హిందీ అనువాద హక్కులను కొనుగోలు చేసింది. ఈనెల 19న తమ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ సినిమాను విడుదల చేసింది. రిలీజ్ చేసిన 24 గంటల్లోనే ఈ చిత్రం 12 మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ఇప్పటికైతే 16.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సినిమా బాగా నచ్చడం తో వ్యూస్ ఇంకాస్త పెరుగుతున్నాయి.