డియర్ కామ్రేడ్ అధికారిక రిలీజ్ డేట్..

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌ బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్నఎమోష‌న‌ల్ డ్రామా `డియ‌ర్ కామ్రేడ్‌`. `యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` ట్యాగ్ లైన్‌. గీత గోవిందం ఫేమ్ రష్మిక మరోసారో విజయ్ తో నటించడం..స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రాబోతుండడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. గత కొద్దీ రోజులుగా ఈ సినిమా రిలీజ్ వాయిదాలు పడుతూ వస్తుంది.

ఏప్రిల్ అనుకుంటే అది కాస్త జులై కి వెళ్ళిపోయింది. మొన్నటి వరకు మే 31 అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. జూలై 26న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం అన్ని సౌత్ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఏకంగా రెండు నెలలు గ్యాప్ రావడం పట్ల అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తుంటే..ఏకంగా అన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కాకినాడ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ న‌టిస్తుండ‌గా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.