‘డియర్ కామ్రేడ్’ టీజర్ టాక్ – అర్జున్ రెడ్డి రెచ్చిపోయాడుగా..

విజయ్ దేవర కొండ – రష్మిక జంటగా నూతన డైరెక్టర్ భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం డియర్ కామ్రేడ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను తెలుగు , తమిళ్ , కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసారు.

1.05 నిముషాల నిడివి తో విడుదలైన ఈ టీజర్లో సినిమా ఎలా ఉండబోతుందో డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేసారు. కాలేజిలో విద్యార్థుల మధ్య గొడవ జరుగుతూ ఉండగా.. స్లో మోషన్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి ఒకరి దవడ పగలగొడతాడు.. నెక్స్ సీన్ లో వాన జల్లు పడుతూ ఉంటే విజయ్ – రష్మికలు ఘాటైన అదర చుంబనంలో మునిగితేలుతున్నట్లు చూపించారు. ఈ రెండు సీన్లు జరిగే సమయంలో “కడలల్లే వేచె కనులే కదిలేను నదిలా కలలే” అంటూ మెలోడియస్ సాంగ్ వినిపిస్తుంది. ఓవరాల్ గా సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ కు కొదవలేదని తెలుస్తుంది. గీత గోవిందం లో రష్మిక కు ఇవ్వలేని ఘాటైన కిస్ ఈ సినిమాలో విజయ్ ఇచ్చి తన కోరిక తీర్చుకున్నాడు. ఈ కిస్ సీన్ చూస్తూనే అర్జున్ రెడ్డి ని మరోసారి చూసిన ఫీలింగ్ అభిమానులకు కలుగుతుంది. ఇక మీరు కూడా ఈ యాక్షన్…రొమాంటిక్ టీజర్ ఫై లుక్ వెయ్యండి.