డియర్ కామ్రేడ్ టీజర్ టైం..

గీత గోవిందం తర్వాత మరోసారి విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘‘డియర్ కామ్రేడ్’’. నూతన డైరెక్టర్ భరత్ కమ్మ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు.

రీసెంట్ గా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను మార్చి 17 న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ్ , మలయాళం , కన్నడ ఇలా నాల్గు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. తాజాగా టీజర్ నిడివి విశేషాలను తెలిపారు. నిమిషం నిడివితో టీజర్ ను రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. టీజర్ నిడివి నిమిషమే ఉన్నా మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా ఉంటుందని రష్మీక ట్విట్టర్లో తెలిపింది.

నోటా తో తమిళం లో ఏంటీ ఇచ్చిన విజయ్.. ఈ చిత్రం తో కన్నడ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తుండగా , రష్మిక క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా తో పాటు విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.