డియర్ కామ్రేడ్… మూడు గంటలు.. మూడు లక్షలు


విజయ్ దేవరకొండ జెట్ స్పీడ్ లో వున్నాడు. “గీత గోవిందం” , ట్యాక్సీవాలా లతోసూపర్ హిట్లు అందుకున్న విజయ్ .. డియర్ కామ్రేడ్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.లక్కీ గర్ల్ రష్మిక మందనతో మల్లో సారి రొమాన్స్ చేస్తూ కనిపించాడు ఈరోజొచ్చిన టీజర్లో.

విజయ్ కమ్యూనిస్ట్ భావజాలమున్న ఒక విద్యార్ధిగా కనిపించబోతున్నాడు. దానితో పాటుగా లిప్ కిస్ తో కూడా చెలరేగిపోయాడు. అర్జున్ రెడ్డిలో ఇలానే ముద్దులతో సెంచరీలు కొట్టేశాడు విజయ్. ఇప్పుడు రస్మిక పెదాలని కూడా జుర్రేశాడు. మొత్తంమ్మీద ఈ టీజర్ తో మరోసారి యూత్ ఎట్రాక్ చేశాడు విజయ్. ఈ టీజర్ విడుదలైన మూడు గంటల్లో మూడు లక్షల మంది వీక్షించడం విశేషం.
తెలుగుతో పాటు తమిళ ,మలయాళం ,కన్నడ భాషల్లో మే ౩1 న ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధంగా ఉంది.